‘పుష్ప 2’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పటినుంచంటే.. !

ABN , First Publish Date - 2022-04-08T21:24:48+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ మొదటి భాగంతో పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేసింది. ‘పుష్ప’ చిత్రం విడుదలై నాలుగు నెలలవుతున్నా.. దాని మ్యానియా ఇంకా తగ్గలేదు. ఈ నేపథ్యంలో రెండో భాగానికి మరింతగా క్రేజ్ పెరిగింది. సుకుమార్ అండ్ టీమ్ ‘పుష్ప’ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ ను అప్పుడే ప్రారంభించారట. ప్రస్తుతం చిత్ర బృందం లొకేషన్ వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను మరో మూడు నెలల్లో అంటే.. జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల వారి సమాచారం.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో యూరప్ టూర్లో ఉన్నాడు.  అక్కడ కొన్ని వారాలుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటాడని, వచ్చిన వెంటనే  ‘పుష్ప 2’ చిత్రంపై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నాడని వినికిడి. ఇక రెండో భాగంలో డైలాగ్ పార్ట్ ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేయబోతున్నాడట సుక్కు. మొదటి భాగానికి మాటలు రాసిన శ్రీకాంత్ విస్సానే రెండో పార్ట్ కూ డైలాగ్స్ రాస్తున్నాడట. మొదటి షెడ్యూల్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ పాల్గొంటారని.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు రెండో భాగానికే హైలైట్ అవుతాయని అంటున్నారు.  

Updated Date - 2022-04-08T21:24:48+05:30 IST

Read more