Prince డిజిటిల్ రైట్స్ వారికేనా..?
ABN , First Publish Date - 2022-06-22T15:01:23+05:30 IST
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan), విదేశీ బ్యూటీ మరియా (Maria) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రిన్స్’ (Prince).

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan), విదేశీ బ్యూటీ మరియా (Maria) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రిన్స్’ (Prince). ఈ మూవీ డిజిటల్ స్టీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దక్కించుకుందని సమాచారం. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శివ కార్తికేయన్ ఇటీవల ‘డాన్’ (Don) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో రూపొందుతోంది ‘ప్రిన్స్’. సురేశ్ ప్రొడక్షన్స్, శాంతిటాకీస్ బ్యానర్స్ పై చిత్రం సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల ఎప్పుడనేది ఒక వీడియో ద్వారా ప్రకటించారు మేకర్స్. హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా, సత్యరాజ్, దర్శకుడు అనుదీప్‌ల సరదా సంభాషణతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
అయితే, తాజా సమాచారం మేరకు ఈ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు గానూ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. శిక కార్తికేయన్‌కు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ మూవీతో తెలుగులో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటాడో చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని రానున్న దీపావళికి తమిళం, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.