ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ .. నిజమేనా?

ABN , First Publish Date - 2022-04-03T13:52:28+05:30 IST

ఇటీవల ‘రాధేశ్యా్మ్’ పాన్ ఇండియా చిత్రంతో ప్రభాస్ అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు కానుంది. వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను కూడా లైన్ లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. పాన్ ఇండియా స్టార్ ఓ హాలీవుడ్ మూవీ చేయబోతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదిరిపోయే సూపర్ హీరో మూవీ కోసం ప్రపంచ ప్రఖ్యాత ప్రొడక్షన్స్ హౌస్ యూనివర్సల్ స్టూడియోస్ ప్రభాస్ ను సంప్రదించిందట. ఆ మేరకు డిస్కషన్స్ కూడా జరిగినట్టు సమాచారం.

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ .. నిజమేనా?

ఇటీవల ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా చిత్రంతో ప్రభాస్ అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు కానుంది. వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో  ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను కూడా లైన్ లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. పాన్ ఇండియా స్టార్ ఓ హాలీవుడ్ మూవీ చేయబోతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదిరిపోయే సూపర్ హీరో మూవీ కోసం ప్రపంచ ప్రఖ్యాత ప్రొడక్షన్స్ హౌస్ యూనివర్సల్ స్టూడియోస్ ప్రభాస్ ను సంప్రదించిందట. ఆ మేరకు డిస్కషన్స్ కూడా జరిగినట్టు సమాచారం. 


ప్రభాస్‌తో యూనివర్సల్ స్టూడియోస్ సూపర్ హీరో మూవీ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోందని టాక్.  ప్రభాస్ సైతం హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నట్టు సమాచారం. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఈ నేపథ్యంలో యూనివర్సల్ స్టూడియోస్ వారు ప్రభాస్ తో సూపర్ హీరో మూవీ సిరీస్ తెరకెక్కించేందుకు రెడీ అవుతుండడం విశేషంగా మారింది. హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజుందో తెలిసిందే. ‘స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, కెప్టెన్ అమెరికా’ లాంటి సూపర్ హీరో మూవీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మరి నిజంగానే ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.   

Updated Date - 2022-04-03T13:52:28+05:30 IST

Read more