Prabhas: సుకుమార్‌తో సినిమా చేయనున్న ప్రభాస్!

ABN , First Publish Date - 2022-12-26T15:24:33+05:30 IST

స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) తో మూవీ చేయడానికి ప్రభాస్ అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సుకుమార్ ఓ లైన్‌ను వినిపించగా అది డార్లింగ్‌కు నచ్చిందని సమాచారం.

Prabhas: సుకుమార్‌తో సినిమా చేయనున్న ప్రభాస్!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రస్తుతం ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ (Project K), ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) చిత్రాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగతోను స్పిరిట్ మూవీని చేయనున్నాడు. ఈ సినిమాల షూటింగ్ పూర్తి కాక ముందే మరో ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) తో మూవీ చేయడానికి ప్రభాస్ అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సుకుమార్ ఓ లైన్‌ను వినిపించగా అది డార్లింగ్‌కు నచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి నిర్మాతలుగా వ్యవహరిస్తారట. లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన అనంతరం ప్రభాస్‌తో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. హీరోలను కొత్తగా చూపించడంతో సుకుమార్ స్టైలే వేరు. వారి నుంచి అత్యుత్తమైన నటనను రాబడుతాడు. ‘రంగస్థలం’ లో రామ్ చరణ్‌ను, ‘పుష్ప’ లో అల్లు అర్జున్‌ను సుక్కు చాలా కొత్తగా చూపించాడు. అయితే, ప్రభాస్‌ను కూడా తనదైన స్టైల్‌లో చూపిస్తాడా లేదా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ఆది పురుష్’ షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాలి. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల విడుదల ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ ప్రకటించారు.

Updated Date - 2022-12-26T15:26:23+05:30 IST