మళ్ళీ తెరపైకి Crazy Combo ?

ABN , First Publish Date - 2022-07-08T20:06:59+05:30 IST

కొన్ని కాంబినేషన్స్ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మళ్ళీ అదే కాంబోలో మరో సినిమా రావాలనే ఆరాటం ఎక్కువవుతుంది. ఆ సినిమా ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి మొదలవుతుంది. టాలీవుడ్‌లో అలాంటి ఓ కాంబినేషన్ తెరపైకి మళ్ళీ రాబోతోందనే సమాచారం అందుతోంది.

మళ్ళీ తెరపైకి Crazy Combo ?

కొన్ని కాంబినేషన్స్ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మళ్ళీ అదే కాంబోలో మరో సినిమా రావాలనే ఆరాటం ఎక్కువవుతుంది. ఆ సినిమా ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి మొదలవుతుంది. టాలీవుడ్‌లో అలాంటి ఓ కాంబినేషన్ తెరపైకి మళ్ళీ రాబోతోందనే సమాచారం అందుతోంది. అదే ప్రభాస్ (Prabhas), కొరటాల (Koratala) కాంబో. వీరిద్దరి కలయికలో తొలిసారిగా తెరకెక్కిన సినిమా ‘మిర్చీ’ (Mirchi). సత్యరాజ్ (Satyaraj), సంపత్ రాజ్ (Sampathraj), నదియా (Nadiya)  తదితర నటీనటులు అద్భుతంగా అభినయించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ‘ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే ప్రభాస్ పలికే డైలాగ్ తోనే మొత్తం కథాంశమంతటినీ పలికించి,  దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు కొరటాల. 


‘మిర్చీ’ సినిమా వచ్చి అప్పుడే తొమ్మిదేళ్ళు అయిపోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రానుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఇటీవల చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ramcharan) హీరోలుగా కొరటాల తెరకెక్కించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొరటాల త్వరలో యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) తో ఓ సినిమా తీయబోతున్నాడు. NTR 30 గా పిలుచుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. యన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. 


ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రభాస్‌ను కలిసిన కొరటాల మళ్ళీ కలిసి ఒక ప్రాజక్ట్ చేద్దామని చర్చించాడట. ప్రభాస్ కూడా పాజిటివ్ గా స్పందించి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను కూడా యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పైనే చెయ్యాలనుకుంటున్నాడట ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవి, చేయబోయేవి అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఈ క్రమంలో కొరటాలతో చేయబోయే సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో చేయాలని నిర్ణయించుకున్నాడట. సలార్ (Salaar), ప్రాజెక్ట్ కె (Project K) చిత్రాల తర్వాత కొరటాల దర్శకత్వంలో చిత్రం మొదలవుతుందని టాక్. ఆ లోపు యన్టీఆర్ తో చేయబోయే సినిమాని పూర్తి చేసి.. స్ర్కిప్ట్ వర్క్ మొదలు పెడతాడట. మరి నిజంగానే ఈ బ్లాక్ బ్లాస్టర్ కాంబో మళ్ళీ వస్తుందేమో చూడాలి. 

Updated Date - 2022-07-08T20:06:59+05:30 IST

Read more