సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan Kalyan: యాక్షన్ స్టంట్స్‌ను తెరకెక్కిస్తున్న పవర్ స్టార్!

ABN, First Publish Date - 2022-12-29T17:45:46+05:30

టాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. యూత్‌లో అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. యూత్‌లో అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ ఎఎమ్. రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌కు పవన్ దర్శకత్వం వహించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలో ‘డాడీ’, ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’ సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించాడు. ఖుషి సినిమాలోని ఫైట్స్ చాలా పాపులర్. ఈ యాక్షన్ స్టంట్స్‌కు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన అనుభవం ఉండటంతో ‘హరి హర వీరమల్లు’ లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పవన్ తెరకెక్కించాడని సమాచారం. ఇంటర్వెల్ బ్లాక్‌కు ముందు ఈ సన్నివేశం వస్తుందని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఎఎమ్. రత్నం కూడా ఈ స్టంట్‌కు భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ‘హరి హర వీరమల్లు’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కెరీర్ విషయానికి వస్తే..‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేయనున్నాడు. మరో రెండు ప్రాజెక్టులు కూడా పవన్ చేతిలో ఉన్నాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటించనున్నాడు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. సుజిత్ డైరెక్షన్‌లోను మరో సినిమాకు ఒకే చెప్పాడు.

Updated Date - 2022-12-29T17:45:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!