సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నానీకి విలన్‌గా Poorna ?

ABN, First Publish Date - 2022-07-20T19:45:52+05:30

నేచురల్ స్టార్ నానీ (Nani) తాజా చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే యువకుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నానీ (Nani) తాజా చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే యువకుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ (Keerthi Suresh) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నానీ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పూర్తిగా మాస్ అవతార్‌లో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదివరకు విడుదలైన ‘దసరా’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నానీ పాత్ర ప్రత్యేకత ఏంటంటే.. పూర్తి స్థాయిలో తెలంగాణ యాసలో డైలాగ్స్ పలకబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ‘దసరా’ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


‘దసరా’ చిత్రంలో మలయాళ బ్యూటీ పూర్ణ (Poorna) పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తోందని సమాచారం. ఆల్రెడీ ఆమె సెట్లోకి జాయిన్ అయి, షూటింగ్‌ను కూడా మొదలు పెట్టడం  జరిగిపోయిందని టాక్. ఇంతకు ముందు పూర్ణ కీలక పాత్ర పోషించిన బోయపాటి శ్రీను (Boyapati Srinu) ‘అఖండ’ (Akhanda) చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. కాకపోతే అందులో ఆమె పోషించింది మంచి పాత్ర. ‘దసరా’ చిత్రంలో పూర్ణ చేస్తోందని కన్నింగ్ అండ్ క్రూయల్ లేడీ పాత్రని చెబుతున్నారు. గతంలో ఆమెను ఎప్పుడూ అలా ప్రేక్షకులు చూసి ఉండరని, ఆ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని ఫిల్మ్ నగర్ సమాచారం. సంతోష్ నారాయణన్ (Santhosh Nayarayanan) సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 


నానీ గత చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది.  కానీ ఓటీటీలో చిత్రానికి మంచి అప్లాజ్ లభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ట్రెండింగ్ గా నిలిచింది. అందుకే నానీ ‘దసరా’ చిత్రంపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. అందులోని మాస్ పాత్రకోసం నానీ విపరీతంగా కష్టపడుతున్నాడు. ‘పుష్ప’ (Pushpa) చిత్రంలోని అల్లు అర్జున్ (Allu Arjun) మేకోవర్‌ తరహాలోనే నానీ ఉంగరాల జుట్టుతో అభిమానుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ ఏడాదే విడుదల కాబోతున్న ‘దసరా’ నటిగా పూర్ణ కు  ఏ స్థాయి చిత్రమవుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-20T19:45:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!