సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాఖీభాయ్ సరసన Pooja Hegde..?

ABN, First Publish Date - 2022-06-10T20:01:35+05:30

సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) క్రేజ్ అండ్ రేంజ్ రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవలే పూరి జగన్నాథ్ (Puri Jagannath)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) క్రేజ్ అండ్ రేంజ్ రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవలే పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రూపొందుతున్న 'జనగణమన' (Janaganama) సినిమాలో నటించడానికి సైన్ చేసిన పూజా..షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. అంతేకాదు, హిందీలో కూడా సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన 'కభీ ఈద్ కభీ దీవాళీ' (Kabhi Eid Kabhi Diwali) అనే సినిమా షూటింగ్‌లోనూ జాయిన్ కాబోతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ నటిస్తున్నారు.


అయితే, ఇదే క్రమంలో ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ (Yash) సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నర్తన్ అనే దర్శకుడితో యష్ నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ముప్తీ' సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ ఈ కాంబో రిపీటవుతుంది. ఈ చిత్రాన్ని యశ్ లేదా కన్నడలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పంపీణి చేసిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం.


అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెని కలిసి స్ర్కిప్ట్ వినిపించినట్టు టాక్. మాతృభాష కావడం..అది కూడా హీరో పాన్ ఇండియా స్టార్ యష్ అవడంతో పూజా ఒకే చెప్పిందట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రానున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. మరి ఇన్ని ప్రాజెక్ట్స్‌కు బుట్టబొమ్మ డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తుందో.

Updated Date - 2022-06-10T20:01:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!