Surya జోడీగా బుట్టబొమ్మ?

ABN , First Publish Date - 2022-07-08T18:26:17+05:30 IST

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే.. అందులో మొదటగా కనిపించే పేరు పూజా హెగ్డే. మాతృభాష కన్నడ అయినప్పటికీ.. తెలుగమ్మాయేమో అని అనుకొనేంతగా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైపోయింది. అగ్రనాయకుల సరసన పూజా కథానాయికగా ఖాయమైతే.. ఆ క్రేజే వేరు.

Surya జోడీగా బుట్టబొమ్మ?

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే.. అందులో మొదటగా కనిపించే పేరు పూజా హెగ్డే. మాతృభాష కన్నడ అయినప్పటికీ..  తెలుగమ్మాయేమో అని అనుకొనేంతగా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైపోయింది. అగ్రనాయకుల సరసన పూజా కథానాయికగా ఖాయమైతే.. ఆ క్రేజే వేరు. ఇటు అందంలోనూ, అటు అభినయంంలోనూ అందెవేసిన చెయ్యిగా బుట్టబొమ్మ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల ‘రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్’ చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ అమ్మడి క్రేజ్‌కు ఏమాత్రం ఢోకాలేదు. వివిధ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 


ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘సర్కస్, సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా విడుదలకు రెడీ అవుతున్న కభీ ఈద్ కభీ దీవాలి’ చిత్రాల్లోనూ,మరో పక్క విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కలయికలో రెండో సినిమాగా వస్తున్న ‘జనగణమన’ (JGM) పాన్ ఇండియా చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డేకు ‘బీస్ట్’ తర్వాత మరో కోలీవుడ్ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చిందని టాక్.. మాస్ దర్శకుడు శివ దర్శకత్వంలో.. సూర్య హీరోగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. బీస్ట్ చిత్రం పరాజయం పాలైనా.. ఆమెకు మరో తమిళ చిత్రం అవకాశం రావడం గమనార్హం. 


అజిత్ తో ఇంతకు ముందు ‘వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం’ లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ ఇచ్చిన శివ.. సూర్యతో కలిసి వర్క్ చేయడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలోనూ, బాలా దర్శకత్వంలోనూ వరుసగా సినిమాలు చేస్తున్న సూర్య.. తదుపరిగా నటించేది శివ దర్శకత్వంలోనే. ఈ సినిమా కోసం శివ ఒక అదిరిపోయే మాస్ కథాంశాన్ని వండుతున్నట్టు టాక్. అందులో పూజా హెగ్డే కీలకపాత్ర పోషించబోతోందని, ఈ సినిమాలో నటించడానికి పూజా హెగ్డే ఆల్ రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అంతేకాదండోయ్.. బీస్ట్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఆమె పారితోషికం విషయంలో అసలేమాత్రం తగ్గలేదని టాక్. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-07-08T18:26:17+05:30 IST