యంగ్ డైరెక్టర్‌కు ఛాన్సిచ్చిన పవర్ స్టార్ ?

ABN , First Publish Date - 2022-03-17T20:46:47+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా భీమ్లానాయక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హరవీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఆ వెంటనే పవర్ స్టార్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారు. ఇక దీని తర్వాత వపన్ కళ్యాణ్ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు సుధీర్ వర్మ. ‘స్వామిరారా, దోచేయ్, కేశవ, కిరాక్ పార్టీ, రణరంగం’ లాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేసిన సుధీర్ వర్మ.. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘రావణాసుర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే.. పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడని సమాచారం అందుతోంది.

గతేడాది తమిళంలో విడుదలైన ‘వినోదయ చిత్తం’ సూపర్ హిట్ గా నిలిచింది. సముద్రఖని దర్శకత్వంలో తనే ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమాలో తంబి రామయ్య మరో కీలక పాత్ర పోషించాడు. ఇదో సోషియో ఫాంటసీ మూవీ. హాలీవుడ్ క్లాసిక్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తరహాలో సాగే వినోద భరితమైన సినిమా ఇది.  నిజానికి ఇదే స్టోరీ లైన్ తో వివిధ భాషల్లో సినిమాలొచ్చాయి. ఇంతకు ముందు తెలుగులో మంచు విష్ణు, నాగార్జున ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కించిన ‘కృష్ణార్జున’ స్టోరీ లైన్ కూడా అదే. అయినా సరే ఈ తమిళ చిత్రాన్ని పవర్ స్టార్ తో తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారని టాక్. దీనికి త్రివిక్రమ్ తనదైన స్టైల్లో స్ర్కీన్ ప్లే , సంభాషణలు అందించబోతున్నారని టాక్. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం.  సముద్రఖని పాత్రను పవర్ స్టార్ చేయబోతుండగా.. తంబి రామయ్య పాత్రను సాయిధరమ్ తేజ్ చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు వెయిట్ చేయాలి. 

Updated Date - 2022-03-17T20:46:47+05:30 IST