సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan Kalyan : మామా అల్లుళ్ళ కాంబో ఉన్నట్టా? లేనట్టా?

ABN, First Publish Date - 2022-09-05T14:22:54+05:30

జనసేన కార్యకలాపాల్లో ఫుల్ బీజీ అయ్యారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). దీని కారణంగా ఆయన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు విడులవుతాయి? అనేవి దర్శక నిర్మాతలకు కన్ఫ్యూజన్‌గా ఉంది. పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) టీజర్‌తో అభిమానులకు కాస్తంత ఊరట కలిగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన కార్యకలాపాల్లో ఫుల్ బీజీ అయ్యారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). దీని కారణంగా ఆయన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు విడులవుతాయి? అనేవి దర్శక నిర్మాతలకు కన్ఫ్యూజన్‌గా ఉంది. పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) టీజర్‌తో అభిమానులకు కాస్తంత ఊరట కలిగించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఖాయం చేయలేకపోయారు. కాకపోతే చిత్రం ఆగిపోయిందన్న పుకార్లకు మాత్రం చెక్ పెట్టగలిగారు. ఈ సినిమా పరిస్థితే ఇలా ఉంటే.. హరీశ్ శంకర్ (Harish Shankar) ‘భవదీయుడు భగత్‌సింగ్’ (Bhavadeeyudu Bhagathsingh) చిత్రం గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఫ్యాన్స్‌కు తన ట్వీట్లతో ఎలివేషన్స్ మాత్రం ఇస్తున్నాడు. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అతడికే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ తమిళ రీమేక్ చిత్రం ‘వినోదయ చిత్తం’ (Vinodaya chittam) ట్రాక్ ఎక్కడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని సమాచారం అందుతోంది. 


ఈ సినిమా కోసం పవర్ స్టార్ నుంచి  తక్కువ కాల్షీట్స్ తీసుకొని.. కేవలం 20 రోజుల్లో ఆయన కాంబినేషన్ సీన్స్‌ను షూట్ చేయాలని ప్లా్న్ చేసుకున్నారు మేకర్స్. దీని కోసం చాలానే హోం వర్క్ జరిగింది. ఇందులో మరో ముఖ్యపాత్ర చేస్తున్న సాయిధరమ్ తేజ్ (Sai dharamtej) వేరే సినిమాలకు కమిట్‌మెంట్స్ ఇవ్వలేదు. చినమావయ్యతో నటించే అరుదైన అవకాశాన్ని వదులుకోడానికి అతడు రెడీగా లేడు. అయితే పవన్ మాత్రం ఏదీ తేల్చుకోలేకపోతున్నట్టు వినికిడి. త్రిక్రమ్ (Trivikram) ఫైనల్ వెర్షన్ రెడీ చేయించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని (SamudraKhani)నే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 


సముద్రఖని ఆర్టిస్ట్ గా మూడు భాషల్లో వరుసగా నటిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పవన్ తో సినిమా తీయమంటే.. ఒప్పుకొనే రకం కాదు. కనీసం నెల ముందుగా ప్లాన్ చేసుకుంటేనే తప్ప.. చిత్రం పట్టాలెక్కే అవకాశం లేదు. నిజానికి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అయిందో ఎవరికీ తెలియని ‘వినోదయ చిత్తం’ చిత్రం గురించి పవన్ అభిమానులకు అంతగా ఆసక్తి లేదు. అలాగే.. సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడనే ఆత్రం అంతకన్నా లేదు.   వాళ్ళ దృష్టిమొత్తం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) పైనే ఉంది. ముందుగా ఈ సినిమాను కంప్లీట్ చేయడంపై దృష్టిపెట్టండని పవన్‌ను అభ్యర్ధిస్తున్నారు. మరి దీనికి పవర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో.. 

Updated Date - 2022-09-05T14:22:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!