ఒకేసారి రెండు చిత్రాలతో ఎన్టీఆర్..?

ABN , First Publish Date - 2022-03-17T13:31:10+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడేళ్ళకు పైగానే లాకయ్యారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పూర్తై ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఒకేసారి రెండు చిత్రాలతో ఎన్టీఆర్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడేళ్ళకు పైగానే లాకయ్యారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పూర్తై ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే, ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అవగానే చరణ్ వెంటనే తన 15వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఆర్సీ 16 కూడా సెట్స్‌పైకి రానుంది.


కానీ, తారక్ మాత్రం ఇంకా తన కొత్త షూటింగ్ మొదలు పెట్టలేదు. ఒకవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు గత ఏడాది నుంచి ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు కొరటాల శివ దర్శకత్వంలో మొదలవబోతున్న ఎన్టీఆర్ 30, బుచ్చిబాబుతో చేయాల్సిన ఎన్టీఆర్ 31 కాస్త అటు ఇటుగా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువచ్చేలా తారక్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. రెండు చిత్రాల షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేసి పెద్ద గ్యాప్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాస్త ఆలస్యం అయినా ఎన్టీఆర్.. రెండు సినిమాలతో వచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ 30ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించనుండగా..బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న ఎన్టీఆర్ 31ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Updated Date - 2022-03-17T13:31:10+05:30 IST