వెట్రిమారన్‌తో NTR..?

ABN , First Publish Date - 2022-06-19T16:24:31+05:30 IST

ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ఈ నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

వెట్రిమారన్‌తో NTR..?

ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ఈ నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందునుంచీ సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లో తారక్ (Tarak) సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తమిళ, కన్నడ, మలయాళ భాషలలో అలాగే, హిందీలో ఆయన నటించిన తెలుగు సినిమాలు డబ్బింగ్ వెర్షన్ రిలీజై అక్కడ ప్రక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 


దాంతో ఇతర భాషలలో సినిమాలు రూపొందిస్తున్న స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తారక్ హీరోగా భారీ చిత్రాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ సాలీడ్ యాక్షన్ స్టోరీలను సిద్ధం చేసుకొని ఎన్టీఆర్‌ని కలుస్తున్నారట. గత ఏడాదిగా తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) తారక్ కోసం కథ రెడీ చేసుకొని వెయిట్ చేస్తున్నట్టు ప్రచారం అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' (Jawan) సినిమాను తెరకెక్కిస్తున్నారు అట్లీ. ఈ సినిమా పూర్తైయ్యాక ఎన్టీఆర్‌కి కథ వినిపించబోతున్నారట.


అంతేకాదు, ఇటీవల కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా వచ్చిన 'విక్రమ్' (Vikram) చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కూడా తారక్‌ను కలిసి కథ చెప్పినట్టు ఆయన కూడా ఒకే చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. లోకేష్ బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ఇస్తుండటంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇదే క్రమంలో ఇప్పుడు మరో తమిళ క్రేజీ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, గత ఏడాది నుంచి 'ఉప్పెన' చిత్రంతో భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం లైన్‌లో ఉన్నాడు. ఇటీవలే తన 30, 31వ చిత్రాలను ప్రకటించారు తారక్‌. ఈ రెండు పూర్తైయ్యాక బుచ్చిబాబు సినిమా, ఆ తర్వాతే మిగతా ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. కాబట్టి లోకేష్ అయినా, వెట్రిమారన్ అయినా ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే కనీసం మూడేళ్ళైనా వెయిట్ చేయక తప్పదు.  

Updated Date - 2022-06-19T16:24:31+05:30 IST

Read more