సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR: అందుకే బుచ్చిబాబుతో సినిమాను ప్రకటించలేదా..?

ABN, First Publish Date - 2022-05-21T16:42:27+05:30

ఈ నెల 20న టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 20న టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఎన్టీఆర్ కొత్త చిత్రాలను మేకర్స్ ప్రకటించారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్‪ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. 


ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో.. యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పతాకంపై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar mikkilineni), హరికృష్ణ.కె (K Harikrishna) నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ గ్లింప్స్‪ని కూడా విడుదల చేసింది. ‘Fury of #NTR30’గా  రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‪ అదిరిపోయింది. ఈ డైలాగ్, మోషన్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దీనితో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) - మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి ఇందులోని తారక్ లుక్‌ను వదిలారు.


అయితే, ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉప్పెన (Uppena) సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు (Buchi Babu) నెక్స్ట్ సినిమాను తారక్‌ (Tarak)తో చేయనున్నట్టు స్వయంగా ఆయనే తెలిపారు. అయితే, ఇంకా సెకండ్ హాఫ్ కథ సిద్ధం కాలేదని తాజా సమాచారం. ఈ కారణంగానే ఎన్టీఆర్ బర్త్ డే రోజున బుచ్చిబాబు సినిమాను ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కమిటైన సినిమాలను పూర్తి చేసేలోపు బుచ్చిబాబు కంప్లీట్ స్క్రిప్ట్‌తో తారక్‌ను ఇంప్రెస్ చేయాల్సి ఉంది. దానికోసమే ఆయన శ్రమిస్తున్నాడట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో.

Updated Date - 2022-05-21T16:42:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!