సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Parasuram: మరో అగ్రహీరో అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్!

ABN, First Publish Date - 2022-08-24T03:18:04+05:30

‘గీత గోవిందం’ (Geetha Govindham) చిత్రంతో తనదైన మార్క్ ప్రదర్శించి.. దర్శకుడిగా ఒకేసారి ఓ పది మెట్లు ఎక్కేశాడు దర్శకుడు పరశురామ్ (Parasuram). ఆ తర్వాత చైతూతో సినిమా కోసం వెయిట్ చేస్తుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గీత గోవిందం’ (Geetha Govindham) చిత్రంతో తనదైన మార్క్ ప్రదర్శించి.. దర్శకుడిగా ఒకేసారి ఓ పది మెట్లు ఎక్కేశాడు దర్శకుడు పరశురామ్ (Parasuram). ఆ తర్వాత చైతూతో సినిమా కోసం వెయిట్ చేస్తుండగా.. అనుకోకుండా సూపర్ స్టార్‌ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) నుంచి పిలుపు రావడం.. తర్వాత ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)కి సిద్ధమవడం వడివడిగా జరిగిపోయాయి. అయితే మహేశ్‌తో మూవీ మాత్రం ఆయన అనుకున్న తరహాలో మాత్రం సాగలేదు. ఎప్పుడూ బ్రేక్‌లే. ఇక ఎలాగోలా ఆ సినిమాని పూర్తి చేసిన పరశురామ్.. ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడో కూడా క్లారిటీ లేదు. ‘సర్కారు వారి పాట’ ప్రొమోషన్లలో తదుపరి చిత్రం ‘చైతూ’తో ఉంటుందనైతే చెప్పాడు కానీ.. చైతూ అందుకు సిద్ధంగా లేడని మాత్రం తెలుస్తుంది. 


ఎందుకంటే.. మహేశ్‌తో సినిమా అవకాశం రాగానే.. నాగచైతన్యతో చేయాలనుకున్న సినిమాని పక్కన పెట్టేసిన పరశురామ్‌ని.. ఇప్పుడు ఆయన కూడా పక్కన పెట్టేసినట్లుగా అయితే టాలీవుడ్ సర్కిల్స్‌లో వినబడుతుంది. పోనీ ‘సర్కారు వారి పాట’ బ్లాక్‌బస్టర్ పడి ఉంటే.. పరశురామ్ పరిస్థితి ఇంకాస్త బెటర్‌గా ఉండేదేమో.. హీరోలే కావాలని ఆయనతో సినిమాకి కాచుకుని కూర్చునేవారేమో. కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. రొటీన్ సినిమా అన్నట్లుగా ఆ సినిమాకి టాక్, రిజల్ట్ రావడంతో పరశురామ్ మళ్లీ హీరో కోసం వేటను ప్రారంభించక తప్పడం లేదు.


సరే, విషయంలోకి వస్తే.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పరశురామ్ తన తదుపరి చిత్రం కోసం అగ్ర హీరో అల్లు అర్జున్‌ని ట్రై చేస్తున్నారట. పరశురామ్‌కి ‘గీత గోవిందం’తో గీతా ఆర్ట్స్ ఓన్ సంస్థగా మారిపోయినా.. ప్రస్తుతం అల్లు అర్జున్ నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్ మాత్రం దొరకడం లేదని టాక్ నడుస్తుంది. ‘గీత గోవిందం’ కథతో పాటు ఆ సమయంలో బన్నీకి పరశురామ్ మరో కథని కూడా చెప్పాడట. ఇంకా బాగా డెవలప్ చెయ్.. తప్పకుండా చేద్దాం అని మాట వరసకి బన్నీ అన్న మాటను పట్టుకుని.. ఇప్పుడు అతని కోసం పరశురామ్ తెగ ట్రై చేస్తున్నాడట. కానీ, అల్లు అర్జున్ మాత్రం అసలు అవకాశమే లేదన్నట్లుగా... పరశురామ్‌కి చిక్కడం లేదని ఫిల్మ్ వర్గాల సమాచారం. అదే ‘సర్కారు వారి పాట’ బ్లాక్‌బస్టర్ అయ్యింటే మాత్రం.. ఈ కథ వేరేలా ఉండేది కదా..

Updated Date - 2022-08-24T03:18:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!