ఓటీటీలో విడుదల కానున్న నిఖిల్ సినిమా?

ABN , First Publish Date - 2022-04-08T17:48:03+05:30 IST

ఇది వరకు వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న నిఖిల్ సిద్ధార్ధ్.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ దక్కించుకోలేకపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మిగతా హీరోలకన్నా భిన్నంగా తన మార్కు చూపించే నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్, కార్తికేయ 2’ చిత్రాల హడావిడిలో ఉన్నాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. దీనికి ఇంకా టైటిల్ ఖాయం చేయలేదు. ఇదిలా ఉంటే.. నిఖిల్ తాజా చిత్రం ‘18 పేజెస్’ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదల కానుందని సమాచారం.

నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆ డేట్లో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు దీన్ని ఓటీటీలోనే డైరెక్ట్ గా విడుదల చేయాలని చూడడం గమనార్హం. ఆమేరకు పలు ఓటీటీ సంస్థలతో ఈ సినిమా నిర్మాతలు చర్చలు జరిపారట. ఎట్టేకేలకు జీ 5 సంస్థ ‘18 పేజెస్’ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.   

Updated Date - 2022-04-08T17:48:03+05:30 IST

Read more