సుందరం, కృష్ణ.. ఒకే కథతో వస్తున్నారా?

ABN , First Publish Date - 2022-03-17T20:10:58+05:30 IST

ఇద్దరు హీరోలు వేరు వేరుగా నటించిన రెండు చిత్రాల కథలు ఇంచుమించుగా ఒకేలా ఉండడం అనేది గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగింది. అయితే ఆ రెండు చిత్రాలూ హిట్టైన సందర్భాలూ ఉన్నాయి. రెండూ నిరాశపరిచిన సినిమాలూ వచ్చాయి. ఓ సీనియర్ హీరో నటించిన ‘అశోక చక్రవర్తి’, వెంకటేశ్ నటించిన ‘ధ్రువనక్షత్రం’ చిత్రాలు రెండూ ఒకే కథతో ఇంచు మించు ఒకేరోజు విడుదలయ్యాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ సూపర్ హిట్ కాగా.. ‘అశోక చక్రవర్తి’ చిత్రం నిరాశపరిచింది. అలాగే.. యన్టీఆర్ ‘టెంపర్’, కళ్యాణ రామ్ ‘పటాస్’ చిత్రాల స్టోరీ లైన్ ఒకటే. రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే సిట్యువేషన్ నానీ ‘అంటే సుందరానికీ’, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రాల విషయంలో కూడా ఎదురైందని సమాచారం. ఈ రెండు సినిమాల కథలూ ఇంచు మించు ఒకేలా ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అంటే సుందరానికీ’ సినిమాలో నానీ ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకి బాగా ఛాదస్తం ఉంటుందట. సినిమాకి అదే హైలైట్ పాయింట్ అని తెలుస్తోంది. అలాగే.. ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంలో కూడా నాగ శౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడని, అతడి కేరక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లోని సన్నివేశాల్లో దాదాపు 60 శాతం వరకూ సామ్యముంటుందని చెప్పుకుంటున్నారు.  అయితే ఈ రెండూ ప్రేమ కథా చిత్రాలే అవడం విశేషం. వీటిలో నాగశౌర్య చిత్రం ఏప్రిల్ 22న విడుదలవుతుండగా.. నానీ చిత్రం జూన్ 10న విడుదల కాబోతోంది.  మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-17T20:10:58+05:30 IST

Read more