మాస్ దర్శకుడికి Nagarjuna అవకాశం ?

ABN , First Publish Date - 2022-06-01T18:38:33+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రంతో మంచి సక్సెస్‌ను కైవసం చేసుకున్నారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). తదుపరిగా ఆయన నటిస్తోన్న యాక్షన్ స్పై అడ్వెంచర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మాస్ దర్శకుడికి Nagarjuna అవకాశం ?

ఈ ఏడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రంతో మంచి సక్సెస్‌ను కైవసం చేసుకున్నారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). తదుపరిగా ఆయన నటిస్తోన్న యాక్షన్ స్పై అడ్వెంచర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయికగా నటిస్తున్న సోనాల్ చౌహాన్ (Sonal Chowhan), నాగార్జున.. ఇద్దరూ ఇందులో ‘రా’ ఏజెంట్స్ (RAW Agents) గా నటించనుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సంవత్సరాంతంలో విడుదల కానుంది. నాగ్ మరో పక్క బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ (Brahastra) అనే భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ ఒక పాత్ర చేస్తున్నారు. రణబీర్ కపూర్ (Ranbeer Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా.. నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ (Ayan Mukharji) తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో తప్ప మరో చిత్రానికి ఇంకా కమిట్ కాని నాగ్..  ఓ మాస్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. 


టాలీవుడ్‌లో మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi). ఆసక్తికరమైన కథాకథనాలతో.. చక్కటి మాస్ ఎలిమెంట్స్ తో చిత్రాలు తీసే ఈ దర్శకుడు నాగార్జునకు ఇటీవల ఓ మాస్ స్టోరీని వినిపించాడట. ఈ మధ్యకాలంలో అలాంటి చిత్రాలకు దూరమైన ఆయన.. సంపత్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సంపత్ నంది గత చిత్రం ‘సీటీమార్’ (Seetimaar) పర్వాలేదనిపించుకుంది. కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamanna) జంటగా రూపొందిన ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సంపత్ నంది ‘ఓదెల రైల్వే్స్టేషన్, బ్లాక్ రోజ్’ లాంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాలు రెండూ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అవి విడుదలయ్యాకా.. సంపత్ నంది నాగార్జున సినిమా కోసం స్ర్కిప్ట్ లాక్ చేసే పనిలో పడతాడు. మరి నాగ్ కోసం సంపత్ ఏ స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-06-01T18:38:33+05:30 IST

Read more