సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దర్శకేంద్రుడితో Nagarjuna 100వ సినిమా..?

ABN, First Publish Date - 2022-06-30T19:45:36+05:30

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (Raghavendra Rao)తో కింగ్ నాగార్జున (Nagarjun) తన 100వ సినిమాను చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (Raghavendra Rao)తో కింగ్ నాగార్జున (Nagarjun) తన 100వ సినిమాను చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో 'ది ఘోస్ట్' (The Ghoast) సినిమాలో నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్ (Sonal Chaun) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి.  


ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున నటించబోతున్న సినిమాలకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయట. ఈ నేపథ్యంలోనే తన 100వ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాలనుకుంటున్నట్టుగా ఇప్పుడు నెట్టింట ప్రచారం జరుగుతోంది. గతంలో నాగార్జున, దర్శకేంద్రుడు కాంబినేషన్‌లో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి భక్తిరస చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా నాగ్ సినీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచాయి. 


అందుకే, నాగార్జున 100వ సినిమాను కూడా ఇదే తరహాలో చేయాలనుకుంటున్నారట. ఈ మధ్య వచ్చిన 'బంగార్రాజు' సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ్..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ జోనర్ మార్చి సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చారట. ఇప్పటికే, వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఇటీవల కాలంలో చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. దాంతో దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సీరియల్స్, సినిమాల నిర్మాణంలో ఉన్న ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టి నాగార్జునతో సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. అదే నిజమైతే అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులుండవు.

Updated Date - 2022-06-30T19:45:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!