సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaithanya - Krithi Shetty: ఇద్దరినీ గట్టెక్కించే సినిమా అదేనా..?

ABN, First Publish Date - 2022-08-30T18:10:11+05:30

లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కూడా చూశాడు. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో విక్రం కె కుమార్ (Vikram K Kumar)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కూడా చూశాడు. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో విక్రం కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా చైతుకి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూ నటించిన లాల్ సింగ్ చడ్డా కూడా ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో తన నెక్స్ట్ సినిమాల మీద గట్టిగా ఫోకస్ పెట్టాడు. కొత్తగా వింటున్న కథల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


ఇక కృతి శెట్టి (Krthi Shetty)కి ఇటీవల రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతో భారీ హిట్ దక్కడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కృతి.. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం చిత్రాలతో రెండు వరుస ఫ్లాప్స్ చూసింది. దాంతో ఇప్పుడు కొత్తగా ఎంచుకుంటున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగు వేస్తుంది.


త్వరలో కృతి హీరోయిన్‌గా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా పక్కన పెడితే మళ్ళీ హిట్ అంటే అటు తమిళంలో సూర్య సరసన నటిస్తున్న సినిమా అలాగే, తెలుగులో మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తున్న సినిమాతో రావాలి. ముఖ్యంగా తెలుగులో తన క్రేజ్ కంటిన్యూ అవ్వాలంటే చైతు, కృతి శెట్టి కలిసి నటిస్తున్న వెంకట్ ప్రభు (Venkat Prabhu) చిత్రం హిట్ అయితేనే. అందుకే, ఇద్దరినీ గట్టెక్కించే సినిమా వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం అని అంటున్నారు. చూడాలి మరి చైతు, కృతిశెట్టిలకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.


Updated Date - 2022-08-30T18:10:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!