Prashanth Neel: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్!

ABN , First Publish Date - 2022-12-31T17:50:31+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఒకరు. యూత్‌లో అతడికి మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తెలుగు డైలాగ్స్, డిక్షన్ విషయంలో తారక్‌కు ఎవరు సాటిరారు. యంగ్ టైగర్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ‘(RRR) లో నటించాడు.

Prashanth Neel: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్!

టాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఒకరు. యూత్‌లో అతడికి మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తెలుగు డైలాగ్స్, డిక్షన్ విషయంలో తారక్‌కు ఎవరు సాటిరారు. యంగ్ టైగర్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ‘(RRR) లో నటించాడు. ఈ చిత్రంలో అతడి నటనకు ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనంతరం తారక్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలను మించి రాణించాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు. అందువల్ల ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్స్‌తో రెండు ప్రాజెక్ట్స్‌‌లను ప్రకటించాడు. ఈ సినిమాలను ‘ఎన్టీఆర్‌30’ (NTR 30), ‘ఎన్టీఆర్31’ (NTR 31)అని వ్యవహరిస్తున్నారు.

‘ఎన్టీఆర్‌30’ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యువసుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఎన్టీఆర్31’ ను ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్నాయి. ‘ఎన్టీఆర్‌31’ కు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో షికార్లు కొడుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించనున్నాడని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఆమిర్‌ను సంప్రదించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్‌ను తీసుకుంటే ప్రాజెక్ట్‌కు మంచి బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు ఆమిర్ ఓకే చెబుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’ కు దర్శకత్వం భావిస్తున్నాడు. సెప్టెంబర్‌లో మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అనంతరం ‘ఎన్టీఆర్31’ పై ప్రశాంత్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాడు.

Updated Date - 2022-12-31T17:50:32+05:30 IST