సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mrunal Thakur: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..?

ABN, First Publish Date - 2022-08-11T18:58:59+05:30

ఇప్పుడు ఎక్కడ విన్నా సీతారామం (Sita Ramam) సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించే మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈ బ్యూటీకి ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కిందట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు ఎక్కడ విన్నా సీతారామం (Sita Ramam) సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించే మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈ బ్యూటీకి ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కిందట. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకెళుతోంది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మూవీతో సక్సెస్ అందుకున్నారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulqer Salman) హీరోగా నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రను పోషించింది.


ఇందులో నటించిన నటీ నటులతో పాటు, దర్శక నిర్మాతలను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా మృణాల్ తన అద్భుతమైన నటనతో అటు ప్రేక్షకులను, ఇటు ఇండస్ట్రీ వర్గాలను బాగా ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా సౌత్‌లో మృణాల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


ఆ మూవీనే ఎన్టీఆర్ 30. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించబోతున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. ఇక ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వారిని కాదని ఫైనల్‌గా ఎన్టీఆర్ 30లో తారక్ సరసన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. దాదాపు ఆమెనే మేకర్స్ ఫైనల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆమె టాలీవుడ్‌లో సెటిలైనట్టే అనుకోవాలి. 

Updated Date - 2022-08-11T18:58:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!