Bigboss 6 : మాస్టర్ చిట్టినాయుడుకు చోటు ?

ABN , First Publish Date - 2022-08-23T20:09:45+05:30 IST

తెలుగులో అత్యధిక టీఆర్పీ కలిగిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ (Bigboss). ఇప్పటికే 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఓ సీజన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్ 6 కు సమయం ఆసన్నమైంది.

Bigboss 6 : మాస్టర్ చిట్టినాయుడుకు చోటు ?

తెలుగులో అత్యధిక టీఆర్పీ కలిగిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ (Bigboss). ఇప్పటికే 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఓ సీజన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్ 6 కు సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ టీవీ ఛానల్‌లో ‘బిగ్ బాస్ 6’ (Bigboss 6) ప్రసారం కాబోతోంది. దాంతో ఇప్పటి నుంచి వీక్షకులు ఈ షోపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రసారమైన అన్ని సీజన్స్‌లకన్నా మరింతగా స్పైసీనెస్ యాడ్ చేయబోతున్నారు. అలాగే.. నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియను మరింత ఉత్కంఠను రేకెత్తించేలా డిజైన్ చేశారట. ఆరో సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మరోసారి నాగార్జున (Nagarjuna) హోస్టింగ్‌తో ‘బిగ్‌బాస్’ షో మరింతగా కళకళలాడబోతోంది. 


‘బిగ్‌బాస్’ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ సంఖ్య కూడా గత సీజన్స్ కన్నా ఎక్కువేనని తెలుస్తోంది. మొత్తం 21 మంది ‘బిగ్‌బాస్’ హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నట్టు సమాచారం. వీరిలో చలాకీ చంటీ, దీపికా పిల్లి, ఆర్జే సూర్య, ఉదయభాను లాంటివారి పేర్లు వినిపిస్తుండగా.. ఈ లిస్ట్‌లో మరో కంటెస్టెంట్ పేరు కూడా బైటికొచ్చింది. అతడు మరెవరో కాదు... ‘వెంకీ, రెడీ, ఢీ , కింగ్’ లాంటి పలు శ్రీనువైట్ల సినిమాల్లో అద్భుతంగా నటించిన మాస్టర్ భరత్ (Master Bharath). ‘రెడీ’ చిత్రంలో అయితే చిట్టినాయుడుగా అతడి అభినయం అబ్బుర పరుస్తుంది. ఇప్పుడు అతడు పెరిగి పెద్దవాడై..  మిస్టర్ భరత్ అయ్యాడు. మంచు విష్ణు ‘దూసుకెళ్తా, అల్లు శిరీష్‌తో కలిసి ‘ABCD’ లాంటి సినిమాల్లో టీనేజర్‌గా నటించి మెప్పించాడు. 


బాలనటుడిగా ఉన్నప్పటి నుంచి భరత్‌లో కామెడీ టైమింగ్ ఓ రేంజ్‌లో ఉండేది. అందుకే అతడ్ని ప్రత్యేకించి బిగ్‌బాస్ హౌస్ లోకి ప్రత్యేకంగా ఎంపికచేసినట్టు సమాచారం. ప్రముఖ టీవీ యాంకర్స్, ఫేమస్ యూట్యూబర్స్, సినీ పెర్సనాలిటీస్ తో ఎప్పటిలాగానే ఈ  బిగ్ బాస్ సీజన్ కూడా కావల్సినంత వినోదాన్ని బోలెడంత బోల్డ్ నెస్‌ను యాడ్ చేస్తారని చెబుతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ .. గత సీజన్స్ ను తలదన్నే రీతిలో ఉండబోతుందేమో చూద్దాం. 

Updated Date - 2022-08-23T20:09:45+05:30 IST