సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ponniyin Selvan: ఓటీటీ రైట్స్‌కు కోట్లు చెల్లించిన డిజిటల్ ప్లాట్‌ఫాం

ABN, First Publish Date - 2022-09-13T20:41:36+05:30

డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్ ’ (Ponniyin Selvan). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఆధారంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్ ’ (Ponniyin Selvan). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. తొలి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాం భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.


‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఈ హక్కుల కోసం దాదాపుగా రూ. 125కోట్లను వెచ్చించిందట. శాటిలైట్ రైట్స్‌ సన్ టీవీ వద్ద ఉన్నాయట. ఈ రైట్స్ కోసం కూడా టీవీ ఛానల్ భారీగానే చెల్లించిందని వార్తలు వెలువడుతున్నాయి. పొన్నియన్ సెల్వన్ భారీ తారగణంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), జయం రవి (Jayam Ravi), కార్తి (Karthi), జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai),  త్రిష (Trisha), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి పనిచేస్తున్నాడు. ‘పొన్నియన్ సెల్వన్’ ఆడియోను తమిళనాడులోని నెహ్రూ స్టేడియంలో తాజాగా విడుదల చేశారు. ఈ ఫంక్షన్‌కు కమల్ హాసన్, రజినీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ 18న సన్ టీవీలో టెలికాస్ట్ కానుంది.

Updated Date - 2022-09-13T20:41:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!