Mallidi Vasishta: హాట్ టాపిక్‌గా బింబిసార దర్శకుడి రెమ్యునరేషన్..?

ABN , First Publish Date - 2022-08-23T15:36:15+05:30 IST

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో బింబిసార (Bimbisara) చిత్ర దర్శకుడి రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

Mallidi Vasishta: హాట్ టాపిక్‌గా బింబిసార దర్శకుడి రెమ్యునరేషన్..?

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో బింబిసార (Bimbisara) చిత్ర దర్శకుడి రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా దర్శకుడిగా అవకాశం దక్కని వాళ్ళు లెక్కకు మించే ఉన్నారు. ఇక దర్శకుడిగా అవకాశం వచ్చి భారీ హిట్ అందుకుంటే మాత్రం హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడిని లాక్ చేసేందుకు రెడి అయిపోతారు. ఇప్పుడు మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) ని కూడా అలా లాక్ చేసుకోవాలని చాలా మంది మేకర్స్ ట్రై చేస్తున్నారట. 


దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) రేంజ్‌లో బింబిసార చిత్రాన్ని రూపొందించి ఇండస్ట్రీలో సినిమా ప్రముఖులతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వశిష్ట. ఇప్పటికే వేరే నిర్మాతలు ఆయనకి అడ్వాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. బింబిసార చూశాక బాలకృష్ణ (Balakrishna) కూడా త్వరలోనే కలిసి సినిమా చేద్దాం అని అన్నారు. అయితే, వశిష్ట దృష్ఠి మాత్రం ముందు బింబిసార సీక్వెల్ మీదే ఉందట. పార్ట్ 1 కోసం జీతం తరహాలోనే నెలకు రెండు లక్షలు అందుకున్నారట. ఇదే తన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.


ఇక బింబిసార భారీ కమర్షియల్ హిట్ కాబట్టి లాభాలలో కొంత వాట ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న మాటలని బట్టి బింబిసార సీక్వెల్ మూవీ కోసం కళ్యాణ్ రామ్ (Kalyan Ram) వశిష్టకి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క హిట్‌తో వశిష్ట రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే, ఈ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టుగా సమాచారం. కాగా, బింబిసార సీక్వెల్ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడుస్తుందో తెలీదు గానీ, అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  

Updated Date - 2022-08-23T15:36:15+05:30 IST