‘అర్జునుడు’ గా Maheshbabu ?

ABN , First Publish Date - 2022-05-23T16:47:35+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తదుపరిగా మహేశ్ నటించబోయే సినిమాపైనే ఉంది అందరి దృష్టి. SSMB 28 గా పిలుచుకొనే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో లాంఛ్ అయిన ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ లాక్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం.

‘అర్జునుడు’ గా Maheshbabu ?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తదుపరిగా మహేశ్ నటించబోయే సినిమాపైనే ఉంది అందరి దృష్టి. SSMB 28 గా పిలుచుకొనే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో లాంఛ్ అయిన ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ లాక్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దీనికి ‘అర్జునుడు’ (Arjunudu) అనే క్యాచీ టైటిల్‌ను అనుకుంటున్నారట. త్రివిక్రమ్‌కు ‘అ’ అనే అక్షరం సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ‘అతడు, అత్తారింటికి దారేది,  అఆ, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలన్నీ ఈ సెంటిమెంట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో పాటు హైయస్ట్ కలెక్షన్స్ రాబట్టాయి. 


అందుకే ఆ సెంటిమెంట్‌నే మహేశ్ (Mahesh) చిత్రానికి కూడా కొనసాగించాలని త్రివిక్రమ్ (Trivikram) భావిస్తున్నాడట.  దాదాపు ఇదే టైటిల్ ఖాయం చేయవచ్చు. మహేశ్ తండ్రి కృష్ణ (Krishna) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను మే 31న రివీల్ చేయబోతున్నారని వినికిడి. పాండవ మధ్యముడు, విలువిద్యా నిపుణుడు, శ్రీకృష్ణునికి అంత్యంత ఆప్తుడు అయిన అర్జునుడు.. కురుక్షేత్ర సంగ్రామంలో శత్రుసంహారం చేసి... తన గాండీవం గొప్పతనమేంటో చాటిచెప్పాడు. సరిగ్గా అతడి వీరత్వమే పుణికిపుచ్చుకున్న ఈ కలియుగ ‘అర్జునుడు’ తన కుటుంబం కోసం ప్రత్యర్ధుల్ని ఎలా గడగడలాడించాడు అన్నదే ఈ సినిమా కథాంశం.  నిజానికి ‘అతడు’ (Athadu) సినిమాకి ముందుగా ‘పార్ధు’ (Pardhu) అనే టైటిల్ అనుకున్నారు. అయితే అప్పుడు ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు దానికి పర్యాయపదంగా ఉన్న ‘అర్జునుడు’ టైటిల్ ను మహేశ్ చిత్రానికే ఫిక్స్ చేస్తుండడం విశేషం.  మరి నిజంగానే SSMB 28 చిత్రానికి ‘అర్జునుడు’ టైటిల్ ను ఖాయం చేస్తారో లేదో చూడాలి. 

Updated Date - 2022-05-23T16:47:35+05:30 IST