సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sarkaruvaari paata : రన్ టైమ్ అలా ఫిక్స్ చేశారా?

ABN, First Publish Date - 2022-05-05T15:52:16+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘Sarkaruvaari paata’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. సరిగ్గా మరో వారంలో సినిమా విడుదల కానుండడంతో అభిమానులు అప్పుడే కౌంట్‌డౌన్ మొదలు పెట్టేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘Sarkaruvaari paata’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. సరిగ్గా మరో వారంలో సినిమా విడుదల కానుండడంతో అభిమానులు అప్పుడే కౌంట్‌డౌన్ మొదలు పెట్టేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఓ రేంజ్‌లో ఆసక్తి నెలకొంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, నదియా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సముద్రఖని పవర్ ఫుల్ విలన్‌గా మెప్పించనున్నారు. ఇంతకు ముందు విడుదలైన Sarkaruvaari paata చిత్రం టీజర్, సింగిల్స్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత హైపు క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాకు కాస్త భారీగానే రన్ టైమ్ ఫిక్స్ చేశారట. 


తాజా సమాచారం ప్రకారం Sarkaruvaari paata చిత్రానికి 163 నిమిషాల రన్ టైమ్‌ను సెట్ చేశారట మేకర్స్. అంటే దాదాపు 2 గంటల 43 నిమిషాలు.  ప్రస్తుతం భారీ కమర్షియల్ చిత్రాలన్నీ ఈ తరహాలోనే భారీ రన్ టైమ్‌తో అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. కంటెంట్‌లో దమ్ముంటే భారీ రన్ టైమ్ పెద్ద విషయం కాదు. ప్రస్తుతం Sarkaruvaari paata చిత్రంపై ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా అన్ని రకాలుగానూ అభిమానుల్ని మెప్పిస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్. బ్యాకింగ్ రంగంలోని అతి పెద్ద స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లోన్ కలెక్షన్ ఏజెంట్‌గా మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-05-05T15:52:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!