ప్రభాస్ జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ?

ABN , First Publish Date - 2022-03-16T18:38:31+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది చిత్రం. ఇక ప్రభాస్ తదుపరి చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా.. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇవి కాకుండా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అనౌన్సె మెంట్ రాబోతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ - మారుతి కాంబో మూవీలో కథానాయికగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనుండగా.. ఒక హీరోయిన్ గా కృతి ఎంపికైందట. మరో హీరోయిన్.. మాళవికా మోహనన్ కాగా.. ఇంకో హీరోయిన్ ను అన్వేషిస్తున్నారని టాక్. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశారని వార్తలు రాగా.. ఆ టైటిల్ ను మార్చబోతున్నారని తెలుస్తోంది.  ఉప్పెన , శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి .. ప్రస్తుతం ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ జోడీగా కూడా ఎంపికవనుండడం విశేషమని చెప్పాలి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-03-16T18:38:31+05:30 IST