బేబమ్మకు బాలీవుడ్ నుంచి పిలుపు?

ABN , First Publish Date - 2022-03-21T18:00:02+05:30 IST

గతేడాది నేచురల్ స్టార్ నానీ, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇందులో కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడట. ఒరిజినల్ లో కృతిశెట్టి చేసిన పాత్రకోసం ఆమెను సంప్రదించారట. సూపర్ హిట్ మూవీ రీమేక్, పైగా షాహిద్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో కృతి శెట్టి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఈ సినిమాలో సాయిపల్లవి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు.

బేబమ్మకు బాలీవుడ్ నుంచి పిలుపు?

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో.. ఆమెకి వరుస అవకాశాలొచ్చిపడ్డాయి. ఈ క్రమంలో ఆమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అవవడంతో కృతి శెట్టి ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం కృతి రామ్, లింగుసామి ‘ది వారియర్’ లోనూ, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇంకా పవర్ స్టార్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ లో కూడా ఆమె నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి బాలీవుడ్ నుంచి కూడా పిలుపు అందినట్టు సమాచారం. 


గతేడాది నేచురల్ స్టార్ నానీ, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇందులో కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడట. ఒరిజినల్ లో కృతిశెట్టి చేసిన పాత్రకోసం ఆమెను సంప్రదించారట. సూపర్ హిట్ మూవీ రీమేక్,  పైగా షాహిద్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో కృతి శెట్టి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఈ సినిమాలో సాయిపల్లవి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా తెలియదు. త్వరలోనే ‘శ్యామ్ సింగరాయ్’ బాలీవుడ్ వెర్షన్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-03-21T18:00:02+05:30 IST