సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మళ్ళీ మెగా హీరోతో Koratala Siva..?

ABN, First Publish Date - 2022-05-31T16:11:22+05:30

డైరెక్టర్ కొర‌టాల శివ‌ (Koratala Siva) మరోసారి మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడనే తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైరెక్టర్ కొర‌టాల శివ‌ (Koratala Siva) మరోసారి మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడనే తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఆయన మెగా మల్టీస్టారర్ ఆచార్య (Acharya) చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కొరటాల కెరీర్‌లో ఆచార్య మొదటి ఫ్లాప్ సినిమా. దాంతో తదుపరి చిత్రంతో భారీ విజయం సాధించాలని శ్రమిస్తున్నారు.


ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇటీవలే చిత్రంలోని తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇది చూస్తేనే తారక్ (Tarak) - కొరటాల (Koratala) కాంబోలో వచ్చే ఎన్టీఆర్ 30 (NTR) భారీ యాక్షన్ చిత్రం అని అర్థమవుతోంది. జూన్ లేదా జూలై నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


అయితే, ఈ మూవీ తర్వాత మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)తో కొరటాల సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వాస్తవంగా ఆచార్య కంటే ముందు చరణ్‌తోనే ఆయన సినిమాను ప్లాన్ చేసుకున్నారు. అయితే, చరణ్ ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో లాక్ అవడం వల్ల చిరు ఇచ్చిన ఆఫర్‌తో ఆచార్య రూపొందించారు. ఇక ఇది ఫ్లాపవడం కూడా మెగా అభిమానులకు తీవ్రం నిరాశకలిగింది . దాంతో చరణ్‌తో భారీ పాన్ ఇండియన్ సినిమా తీసి సాలీడ్ హిట్ ఇవ్వాలని కసితో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చరణ్ - కొరటాల కాంబోలో ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమాను శంకర్ (Sankar) దర్శకత్వంలో చేస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు (Dil Raju) మొదటిసారి భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-05-31T16:11:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!