KGF 2: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా పాన్ ఇండియన్ స్టార్..?

ABN , First Publish Date - 2022-03-23T21:42:42+05:30 IST

సౌత్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా ఒకటి. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను భారీ స్థాయిలో ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు.

KGF 2: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా పాన్ ఇండియన్ స్టార్..?

సౌత్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా ఒకటి. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను భారీ స్థాయిలో ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇటీవల వచ్చిన 'తుపాన్ తుపాన్' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే, మెకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హాజరవబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే భారీ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 


దాంతో కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరయితే భారీగా అంచనాలు ఏర్పడతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే కేజీఎఫ్ 2 ఈవెంట్ అదిరిపోతుందనడంలో సందేహమే లేదు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్‌మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. కాగా, ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి, జగపతి బాబు, రావు రమేశ్.. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హోంబలె పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ఛాటర్ 1తో పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ అందుకున్న హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 

Updated Date - 2022-03-23T21:42:42+05:30 IST