సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాజమౌళితో కరణ్ జోహార్ సినిమా?

ABN, First Publish Date - 2022-01-04T19:26:33+05:30

‘బాహుబలి’ నుంచి టాలీవుడ్ టేకింగ్ కింగ్ రాజమౌళి, బాలీవుడ్ మేకింగ్ కింగ్ కరణ్ జోహార్‌ల మధ్య అనుబంధం బలపడింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ బాలీవుడ్ రిలీజ్ కు ముఖ్య కారకుడూ కరణ్ జోహారే. జక్కన్న దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో తెలిసిన కరణ్ జోహార్ .. ఆయనతో ఓ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ నిర్మించాలని డిసైడయ్యాడట. ఈ సినిమాకి సోలో నిర్మాతగా తన పేరుండాలన్నది కరణ్ ఆలోచన. ఈ మేరకు ఆ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. కరణ్ నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఓ స్ట్రైట్ హిందీ సినిమా రాబోతోందని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బాహుబలి’ నుంచి టాలీవుడ్ టేకింగ్ కింగ్ రాజమౌళి, బాలీవుడ్ మేకింగ్ కింగ్ కరణ్ జోహార్‌ల మధ్య అనుబంధం బలపడింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ బాలీవుడ్ రిలీజ్ కు ముఖ్య కారకుడూ కరణ్ జోహారే. జక్కన్న దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో తెలిసిన కరణ్ జోహార్ .. ఆయనతో ఓ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ నిర్మించాలని డిసైడయ్యాడట. ఈ సినిమాకి సోలో నిర్మాతగా తన పేరుండాలన్నది కరణ్ ఆలోచన. ఈ మేరకు ఆ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. త్వరలోనే కరణ్ నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఓ స్ట్రైట్ హిందీ సినిమా రాబోతోందని సమాచారం. 


అయితే ఇది రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఉండనుందట. ఇప్పటి వరకూ భారీ చిత్రాలు తీసిన జక్కన్న.. బాలీవుడ్ లో ఓ ప్రయోగాత్మక చిత్రం తీయబోతున్నాడట. ఇందులో స్టార్స్ ఎవరూ ఉండరు. అందరూ కొత్తవారే ఉంటారట. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న రాజమౌళి.. ఆ సినిమా గ్యాప్ లో బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తాడని టాక్. అలా కుదరకపోతే మహేశ్ సినిమా తర్వాత మొదలవుతుందట. తన కెరీర్ లో ఎందరో బడా స్టార్స్ తో సినిమాలు చేసిన జక్కన్న ‘మర్యాదరామన్న, ఈగ’ లాంటి సినిమాలు తీసి స్టార్ లేకుండా కూడా హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే ప్రయత్నం బాలీవుడ్ లోనూ చేయబోతున్నాడు. 

Updated Date - 2022-01-04T19:26:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!