అక్కినేని వారసుడితో అతిలోక సుందరి వారసురాలు?

ABN , First Publish Date - 2022-03-12T02:26:19+05:30 IST

అఖిల్ అక్కినేని.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో కెరీర్‌లో తొలి హిట్ నమోదు చేసుకున్నాడు. తాజాగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. సినిమాని ఆగస్ట్ లో విడుదల చేస్తున్నారు. ఇక మనోడి బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైంది. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇందులో అఖిల్ జోడీగా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ను ఎంపిక చేయబోతున్నారని టాక్. నిజానికి శ్రీదేవి జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని అనుకొనేవారు. ఆవిడ కోరిక అప్పట్లో నెరవేరలేదు.

అక్కినేని వారసుడితో అతిలోక సుందరి వారసురాలు?

అఖిల్ అక్కినేని.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో కెరీర్‌లో తొలి హిట్ నమోదు చేసుకున్నాడు. తాజాగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. సినిమాని ఆగస్ట్ లో విడుదల చేస్తున్నారు. ఇక మనోడి బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైంది. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇందులో అఖిల్ జోడీగా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ను ఎంపిక చేయబోతున్నారని టాక్. నిజానికి శ్రీదేవి జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని అనుకొనేవారు. ఆవిడ కోరిక అప్పట్లో నెరవేరలేదు. ఇన్నాళ్లకిప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మహేశ్ బాబు, యన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సరసన నటిస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి కానీ.. ఏవీ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు అఖిల్ జోడీగా ఆమె దాదాపు ఖాయమైందని బాలీవుడ్ వర్గాల సమాచారం. 


ఇటీవల బోనీకపూర్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో జాన్వీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అఖిల్ తోనే ఆమె ఎంట్రీ ఖాయమవడం విశేషం. గతంలో నాగార్జున శ్రీదేవి జోడీగా ‘ఆఖరి పోరాటం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు వారి వారసులు జోడీ కట్టనుండడం అభిమానులకు పండగే. ఏజెంట్ సినిమా పూర్తయిన వెంటనే అఖిల్ ఈ పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి వివరాలు ఇంకా తెలియవు. త్వరలో చిత్రం అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి వీరిద్దరి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-03-12T02:26:19+05:30 IST