సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Janaganamana: అంత బడ్జెట్ పెడుతున్నారా..?

ABN, First Publish Date - 2022-08-24T20:02:05+05:30

తాజాగా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ (Puri Jagannath) డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (Janaganamana) గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ (Puri Jagannath) డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (Janaganamana) గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో 'జనగణమన' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్మీ వార్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. శ్రీకర స్టూడియోస్-పూరి కనెక్స్ట్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 


విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై పూరి చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారు. అయితే, ఈ సినిమా విడుదలకి ముందే జెజిఎం చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన  పూరి తన కాన్పిడెన్స్ ని మరోసారి రివీల్ చేశారు. అయితే, ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తాజా సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో 'జనగణమన'ని నిర్మిస్తున్నారట. 


పూరి సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్స్‌తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా నిర్మాణంలో భాగమయ్యారు. ఈ సినిమాతోనే వంశీ నిర్మాతగా మారుతుండటం విశేషం. తొలి ప్రయత్నంలోనే భారీ బడ్జెట్ కేటాయించడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. లైగర్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూరి జనగణమన కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారంటే రెండు ప్రాజెక్ట్స్‌పై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. మరి ఈ నమ్మకాలు లైగర్ విడుదలయ్యాక రెట్టింపు అవుతాయా..లేక తారుమారువుతాయా చూడాలి. 

Updated Date - 2022-08-24T20:02:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!