నితిన్‌తో 'పెళ్లిసందD' భామ ఫిక్స్..?

ABN , First Publish Date - 2022-03-18T16:22:13+05:30 IST

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ఎడిట‌ర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ వక్కంతం వంశీతో ఓ సినిమాను చేయనున్నట్టు సమాచారం.

నితిన్‌తో 'పెళ్లిసందD' భామ ఫిక్స్..?

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ఎడిట‌ర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ వక్కంతం వంశీతో ఓ సినిమాను చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. 


నితిన్ సరసన ఈ సినిమాలో బెంగ‌ళూరు బ్యూటీ, 'పెళ్లిసంద‌D' ఫేం శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుందట. ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం 'జూనియ‌ర్' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. శ్రీలీల ఇప్పటికే వరుసగా తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు నితిన్ సినిమాలోనూ అవకాశం వస్తే క్రేజ్ ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు. 

Updated Date - 2022-03-18T16:22:13+05:30 IST