సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తమిళంలో కూడా సర్కారు వారి పాట..?

ABN, First Publish Date - 2022-04-27T14:52:48+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురామ్ పెట్లా ఈ సినిమాని తెరకెక్కించాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైనెమెంట్స్..14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వచ్చే నెల 12న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. 


అయితే, ఈ మధ్య మన తెలుగు సినిమాలు ఒకేసారి హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రాన్ని కూడా తమిళంలో రిలీజ్ చేయనున్నారట. దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలో తమిళ వెర్షన్ అప్‌డేట్స్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Updated Date - 2022-04-27T14:52:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!