సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mohan Babu ఫ్యామిలీ వైయస్ జగన్ కు దూరమవుతోందా?

ABN, First Publish Date - 2022-09-05T18:24:02+05:30

మంచు మనోజ్ (Manchu Manoj) ఇప్పుడు బాహాటంగానే స్వర్గీయ భూమా నాగిరెడ్డి (Bhooma Nagireddy) రెండో కూతురు మౌనిక (Mounika)తో బయటకి రావటం.. సాంఘిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. త్వరలోనే ఒక శుభ వార్తతో వస్తాను అని, అలాగే రాజకీయాల ఎంట్రీ విషయం గురించి కూడా మాట్లాడతా అని మనోజ్ అనటంతో.. ఇప్పుడు అందరి కళ్ళు మంచు కుటుంబం మీదే వున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచు మనోజ్ (Manchu Manoj) ఇప్పుడు బాహాటంగానే స్వర్గీయ భూమా నాగిరెడ్డి (Bhooma Nagireddy) రెండో కూతురు మౌనిక (Mounika)తో బయటకి రావటం.. సాంఘిక మాధ్యమాల్లో  వైరల్ గా మారింది. త్వరలోనే ఒక శుభ వార్తతో వస్తాను అని, అలాగే రాజకీయాల ఎంట్రీ విషయం గురించి కూడా మాట్లాడతా అని మనోజ్ అనటంతో..  ఇప్పుడు అందరి కళ్ళు మంచు కుటుంబం మీదే వున్నాయి. గత ఎన్నికల్లో మోహన్ బాబు (Mohan Babu)  కుటుంబం వైఎస్ జగన్ (YS Jagan) పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ గెలిచిన తరువాత వైఎస్ జగన్, మోహన్ బాబు కుటుంబానికి ఏమి చేయకపోవటంతో మోహన్ బాబు కొంత అసంతృప్తితో వున్న మాట వాస్తవమే. దానితో మోహన్ బాబు కూడా ఎక్కువగా వై ఎస్‌ఆర్ సిపి పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. 


కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) ని కలవటం కూడా రాజకీయ వర్గాలలో చర్చను లేవనెత్తింది, కానీ స్పష్టత రాలేదు. ఇప్పుడు మోహన్ బాబు కుమారుడు మనోజ్ భూమా నాగిరెడ్డి మౌనికని వివాహం చేసుకుంటాడు అన్న విషయం రూడీ అవుతున్నట్టు కనపడుతోంది. భూమా కుటుంబం తెలుగు దేశం పార్టీలో వుంది. ఇప్పుడు మనోజ్ మౌనికని వివాహం చేసుకున్నట్టు అయితే తెలుగుదేశంకి సపోర్ట్ చెయ్యాలి. అదీ కాకుండా, మోహన్ బాబు కుటుంబం గత రెండు సంవత్సరాల నుంచీ జగన్‌కి దూరంగానే వుంది. ఎందుకంటే మోహన్ బాబు తన స్కూల్ ఫీజు రీఎంబార్సుమెంట్  విషయం లో చంద్రబాబు ని బాహాటంగా విమర్శించి అందుకోసమే అన్నట్టుగా విభేదించి జగన్‌కి సపోర్ట్ చేసారు.  కానీ జగన్ కూడా తన స్కూల్‌కి ఏమి చెయ్యకపోవటం తో మోహన్ బాబు కొంచెం కినుక వహించారు అని అనుకుంటున్నారు. 


ఇవేమీ కాకుండా, వై ఎస్ జగన్‌కు ఎన్నికలముందు అందరినీ, ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఫోన్ చేసి ప్రచారం కోసం పిలవటం, గెలిచాక మొండి చెయ్యి చూపటం పరిపాటి అయిందని అంటున్నారు.  అలాగే మోహన్ బాబు కుటుంబానికి కూడా జగన్ మొండి చెయ్యి చూపటంతో, కొంత అసంతృప్తి తో వున్న మోహన్ బాబు ఈసారి జగన్‌కి సపోర్ట్ చెయ్యకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ వివాహంతో మోహన్ బాబు కుటుంబం మళ్ళీ చంద్రబాబు వైపే మొగ్గు చూపెడుతున్నట్టు కనపడుతోంది అని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సినిమా వాళ్ళ ప్రభావం రాజకీయాల్లో  ఈసారి ఎక్కువగానే వుండే అవకాశం వుంది అని చిత్ర పరిశ్రమలో కూడా అనుకుంటున్నట్టు తెలిస్తోంది. 

Updated Date - 2022-09-05T18:24:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!