సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NBK 107: ఆ నటుడ్ని తప్పించారా..తప్పుకున్నాడా..?

ABN, First Publish Date - 2022-09-08T19:46:05+05:30

సీనియర్ నటుడు అరవింద్ స్వామి (Arvind Swamy) తెలుగులో ధృవ సినిమాతో వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ హీరో రేంజ్‌లో ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటుడు అరవింద్ స్వామి (Arvind Swamy) తెలుగులో ధృవ సినిమాతో వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ హీరో రేంజ్‌లో ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)తో పోటీ పడి నటించిన అరవింద్ స్వామికి ఈ సినిమా తెచ్చిన పాపులారిటీతో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, ఆయన రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్ వద్దనుకున్నట్టు వార్తలు వచ్చాయి.


ఇదే కారణంతో ఇప్పుడు మరో సినిమాను కూడా వదులుకున్నట్లు ఓ తాజా వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా రూపొందుతున్న సినిమా NBK107 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గోపీచంద్ మలినేని (Gopichand malineni) ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ (Shruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ టీజర్ వచ్చి నందమూరి అభిమానుల్లో అలాగే, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. అయితే, ఈ సినిమాలో కీలకమైన పాత్రకు అరవింద్ స్వామిని తీసుకోవాలనుకున్నారట దర్శకనిర్మాతలు.


కానీ, ఆయన అసలు తగ్గేదే లే అనేట్టుగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. దీంతో ఆయనను కాదని మరో నటుడిని తీసుకున్నట్టు సమాచారం. ఇలా ఇప్పటికే, రెమ్యునరేషన్ కారణంగా తెలుగులో చాలానే సినిమాలు వదులుకున్నారు అరవింద్ స్వామి. ఇదే ధోరణిలో ఉంటే ఇక టాలీవుడ్ మేకర్స్ సంప్రదించడం కష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక, తమిళంలో మాత్రం అరవింద్ స్వామి అరడజనుకు పైగా సినిమాలను చేస్తున్నారు. ఈ చిత్రాలు 2022, 2023, 2024 లలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Updated Date - 2022-09-08T19:46:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!