‘పుష్ప 2’ లో నిన్నటి తరం హీరోయిన్ ?

ABN , First Publish Date - 2022-03-17T16:38:04+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారాడు. ఐకాన్ స్టార్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో వసూళ్ళు కురిపించి.. ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా రాసుకున్న స్ర్కిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే రెండో భాగం లో బాలీవుడ్ స్టార్స్ ను ఎవరినీ కూడా సుకుమార్ ఎంపిక చేయలేదు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాలోని ఒక ముఖ్యపాత్రకోసం నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం.

‘పుష్ప 2’ లో నిన్నటి తరం హీరోయిన్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారాడు. ఐకాన్ స్టార్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో వసూళ్ళు కురిపించి.. ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో  బాలీవుడ్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా రాసుకున్న స్ర్కిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే రెండో భాగం లో బాలీవుడ్ స్టార్స్ ను ఎవరినీ కూడా సుకుమార్ ఎంపిక చేయలేదు.  త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాలోని ఒక ముఖ్యపాత్రకోసం నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. అది సినిమాకే కీలకం కానుందట. 


‘యమలీల, అమ్మదొంగ, ఒక చిన్నమాట, పెద్దన్నయ్య లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రజ.. ఆ తర్వాత పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించింది. 2000 లో వచ్చిన ‘సమ్మక్క సారక్క’ చిత్రం తర్వాత తెలుగులో మళ్ళీ నటించలేదు. తిరిగి 14 ఏళ్ళ తర్వాత నాగశౌర్య ‘దిక్కులు చూడకురామయ్య’ చిత్రంలో నటించి మెప్పించారు. అక్కడ నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు ఇంద్రజ. గతేడాది ‘అల్లుడు అదుర్స్’ లో బెల్లంకొండ శ్రీనివాస్ తల్లిగా నటించిన ఆమె ఈ ఏడాది రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ లో ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం టీవీ షోస్ లో జడ్జ్ గా అదరగొడుతున్న ఇంద్రజ.. ఇటు సినిమాల్లోనూ హుందా కలిగిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘పుష్ప 2’ చిత్రంలోనూ కీలక పాత్ర చేస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా ఇంద్రజకు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. 

Updated Date - 2022-03-17T16:38:04+05:30 IST

Read more