సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hebah Patel కి మళ్ళీ నిరాశేగా..!

ABN, First Publish Date - 2022-09-01T20:11:16+05:30

గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah Patel) నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ (Odela Railway Station). ఆహా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ కూడా మళ్ళీ హెబ్బాని నిరాశపరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah Patel) నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ (Odela Railway Station). ఆహా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ కూడా మళ్ళీ హెబ్బాని నిరాశపరిచింది. అలా ఎలా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, కుమారీ 21 ఎఫ్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజిల్, 24 కిసెస్ లాంటి చిత్రాలు అలా వచ్చినవే.


అయితే, వీటిలో ఏది కూడా కుమారీ 21 ఎఫ్ రేంజ్‌లో హిట్ సాధించలేదు. దాంతో ఒక్కసారిగా హెబ్బా క్రేజ్ అలా పడిపోయింది. దానికి తోడు కొత్త అమ్మాయిలు ఇండస్ట్రీకి పరిచయం కావడం కూడా హెబ్బాకి మైనస్ అయింది. దాంతో ఐటెంస్ సాంగ్స్ చేయడానికి రెడీ అయిపోయింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో ఓ మాస్ సాంగ్ చేసి అలరించింది. అయినా కనీసం అలా కూడా అవకాశాలు క్యూ కట్టలేదు.


ఇక ఆగస్టు 26 నుంచి హెబ్బా పటేల్ నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత చిత్రాలలో చేసినటువంటి గ్లామర్ పాత్ర కాకుండా ఈ మూవీలో నేచురల్‌గా నటించింది. అయితే, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం హెబ్బా పరిస్థితి చూస్తుంటే తన క్రేజ్ దాదాపుగా తగ్గినట్టే కనిపిస్తోంది. చేతిలో ఇప్పుడు రెండు తమిళ చిత్రాలు..ఒక తెలుగు చిత్రం ఉంది. మరి ఇవి ఎంతవరకు హెబ్బా పటేల్ కెరీర్‌కి ఉపయోగపడతాయో చూడాలి.

Updated Date - 2022-09-01T20:11:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!