సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pooja Hegde కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారా..?

ABN, First Publish Date - 2022-08-20T15:39:51+05:30

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde)కి మళ్ళీ యూవీ క్రియేషన్స్‌లో ఛాన్స్ వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూజాకి ఇటీవల వరుసగా మూడు ఫ్లాపొచ్చినా అవకాశాలకు కొదవలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde)కి మళ్ళీ యూవీ క్రియేషన్స్‌లో ఛాన్స్ వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూజాకి ఇటీవల వరుసగా మూడు ఫ్లాపొచ్చినా అవకాశాలకు కొదవలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 'జనగణమన' (Janaganamana)...'ఎస్ ఎస్ ఎంబీ' 28 (SSMB 28)వ చిత్రాలున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు సైన్ చేసినట్టు సమాచారం. వీటిలో ఒకటి  కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) నటించబోయే చిత్రం కూడా ఒకటని తెలుస్తోంది. 


సూర్య కెరీర్ లో 42వ చిత్రంగా మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో పూజా పేరు పరిశీలిస్తున్నారటా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్-స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారట. అయితే, ఇది నిజమా కాదా అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. దీనికి కారణం పూజాకి యూవీ వారితో ఇంతకముందు విబేధాలు తలెత్తడమే. షూటింగ్ కి సరిగ్గా హాజరు కాలేదని..రిలీజ్ సమయంలో ప్రమోషన్స్‌కి అంత ఆసక్తి చూపించలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి.


దాంతో యూవీ వారు కాస్త ఇబ్బందులకు గురై, ఆ కారణంగానే పూజా హెగ్డేపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు టాక్ వినిపించింది. కానీ, ఇదే సంస్థలో మళ్ళీ తనకి ఛాన్స్ ఇవ్వబోతున్నారనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం పూజాకున్న క్రేజ్ వల్లే కాంప్రమైజ్ అయ్యారా లేక సూర్య, స్టూడియో గ్రీన్ వారి మాట కాదనలేక తనను తీసుకునేందుకు సిద్ధమయ్యారా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడిస్తారో. కాగా, ఈ బ్యూటీ 'కబీ ఈద్ కబీ దివాలీ'..'సిర్కస్' చిత్రాల్లో నటిస్తోంది.

Updated Date - 2022-08-20T15:39:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!