God Father: హాట్ టాపిక్‌గా సల్మాన్ రెమ్యునరేషన్..!
ABN , First Publish Date - 2022-03-17T16:13:10+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు అనీ.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు అనీ. అందుకు కారణం సల్మాన్ హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు. సినిమాకు, బిగ్ బాస్ రియాలిటీ షోకు, ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్ ఫిలింస్‌కు సల్మాన్ అందుకునే రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంటుంది. అంత పెద్ద స్టార్ మన టాలీవుడ్ సినిమాలో కనిపించే కొన్ని నిమిషాలకు ఎన్ని కోట్లు డిమాండ్ చేసి ఉంటాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చి చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.
అయితే, అసలు విషయం మాత్రం షాకింగ్‌గా అనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ స్నేహానికి ఎంతో విలువను ఇస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఏమీ ఆశించకుండానే తన సపోర్ట్ అందిస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరో బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో సల్మాన్ ఖాన్‌ను విడదీయరాని బంధం ఉంది. అప్పుడప్పుడూ షారుక్ సినిమాలో కనిపించే సల్మాన్ రెమ్యునరేషన్ లేకుండా చేస్తుంటారు. అలాంటి బంధమే టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్‌తోనూ ఉంది. అందుకే, సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నందుకు గానూ ఏమాత్రం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.

మేకర్స్ గానీ, చిరు గానీ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోమని బలవంత పెడితే తప్పుకుంటానని అన్నట్టు తెలుస్తోంది. చిరు కోసం..ఆయన మీదున్న అభిమానం వల్లే గాడ్ ఫాదర్ చేస్తున్నాని సల్మాన్ మేకర్స్‌కు చెప్పారట. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మెగాస్టార్, భాయ్ సల్మాన్‌ల కోసం సాలీడ్ మాస్ సాంగ్ రెడీ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో చిరు, సల్మాన్ అభిమానులను సర్‌ప్రైజ్ చేయనున్నారు.