God Father: రిలీజ్ డేట్ లాక్ అయిందా..?

ABN , First Publish Date - 2022-05-10T17:03:16+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్స్‌లో గాడ్ ఫాదర్ (God Father) చిత్రం కూడా ఒకటి. తాజా సమాచారం మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రందం లాక్ చేసినట్టు తెలుస్తోంది.

God Father: రిలీజ్ డేట్ లాక్ అయిందా..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్స్‌లో గాడ్ ఫాదర్ (God Father) చిత్రం కూడా ఒకటి. తాజా సమాచారం మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రందం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్.. తనయుడు రామ్ చరణ్‌ (Ran Charan)తో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఆచార్య (Acharya) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సైరా కూడా మంచి హిట్ సాధించింది.


దాంతో ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్నారు. కానీ, మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు పెట్టుకున్న అంచనాలు అనూహ్యంగా తారుమారయ్యాయి. దాంతో చిరు నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. సెట్స్ మీదున్న మూడు చిత్రాలలో ముందు గాడ్ ఫాదర్ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్ చిత్రానికి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా మోహన్ రాజా (Mohan Raja) మెగాస్టార్‌తో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్నారు. 


దాదాపు చిత్రీకరణ పూర్తి కావచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), నయనతార (Nayanatara), దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath), సత్యదేవ్ లాంటి ప్రముఖ నటీ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ చిత్రాన్ని వచ్చే ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందుగా 2022 ఆగస్టు 12న విడుదల చేయాలని, ఇదే డేట్‌ను ఫిక్స్ చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నారట. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాతో పాటుగా భోళా శంకర్, మెగా 154 కూడా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.   

Updated Date - 2022-05-10T17:03:16+05:30 IST