Venkat Prabhu: నాగ చైతన్య సినిమాలో విలన్‌గా ప్రముఖ హీరో..!
ABN , First Publish Date - 2022-10-14T01:40:05+05:30 IST
నాగ చైతన్య (Naga Chaitanya) వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

నాగ చైతన్య (Naga Chaitanya) వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. బై లింగ్విల్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ పాత్రను చేస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతుంది.
వెంకట్ ప్రభు నుంచి వచ్చిన ‘మానాడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. శింబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందువల్ల చైతో తెరకెక్కిస్తున్న సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలను మించేలా చిత్రం ఉండాలని వెంకట్ ప్రభు భావిస్తున్నాడట. ఈ మూవీలో విలన్ పాత్రలో ప్రముఖ హీరోని నటింప చేయాలని అనుకుంటున్నాడట. విలన్ పాత్రలో హీరో జీవా (Jiiva) కనిపించనున్నట్టు సమాచారం. మేకర్స్ అతడితో సంప్రదింపులు జరపగా అంగీరించాడని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023, ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘థాంక్యూ’ (Thank You) లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) లో అతిథి పాత్రను పోషించాడు. ఈ మూవీ కూడా అతడికి నిరాశనే మిగిల్చింది.

Read more