Pushpa the rule : ‘లోఫర్’ గాళ్ ఐటెమ్ సాంగ్?

ABN , First Publish Date - 2022-03-20T17:32:24+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళతో బాక్సాఫీస్‌పై విరుచుకు పడింది చిత్రం. ఈ సినిమాతో బన్నీ పేరు నేషనల్ వైడ్ గా మారు మోగిపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడంతో అక్కడ రెండో పార్ట్ ‘పుష్ప ది రూల్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ ముందుగా రాసుకున్న స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. వచ్చే నెల్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. కేరళలోని దట్టమైన అడవుల్లోనూ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. ‘పుష్ప’ మొదటి భాగంలో సమంత ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలో రెండో పార్ట్ లో కూడా దీనికి మించిన ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

నిజానికి సమంత చేసిన ఐటెమ్ సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో సమంత సీన్ లోకి వచ్చింది. అయితే రెండో భాగం లో మాత్రం దిశా పటానీకే ఛాన్స్ ఇవ్వాలని సుక్కూ టీమ్ భావిస్తోందట. ఆమేరకు దిశా పటానీని సంప్రదించబోతున్నారట. దిశ ఇంతకు ముందు వరుణ్ తేజ్ , పూరీ కాంబో మూవీ ‘లోఫర్’ తో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. అందులో ఆమె గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత దిశా పటానీ బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ సెటిలైపోయింది. ‘పుష్ప’ మొదటిభాగంలోని ఐటెమ్ సాంగ్ కు సమంతకు మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి.. రెండో భాగం కోసం తనకొచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోదు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-03-20T17:32:24+05:30 IST