సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దిల్‌రాజు కొలువులో తమిళ సార్?

ABN, First Publish Date - 2022-03-13T16:57:52+05:30

కోలీవుడ్ మాస్ హీరో ధనుష్ ఇటీవల ‘మారన్’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించాడు. బాలీవుడ్‌లో కూడా ధనుష్‌కి మంచి ఇమేజ్ ఉంది. అలాగే హాలీవుడ్ లోనూ ధనుష్ నటించి మెప్పించాడు. అయితే అతడు తెలుగులో మాత్రం ఇంతవరకూ మంచి మార్కెట్ ను సంపాదించుకోలేకపోయాడు. గతంలో పలు డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ అంతగా రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వాత్తి’ పేరుతో తమిళం కూడా చిత్రం విడుదల కానుంది. సగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ ను వాయిదా వేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ మాస్ హీరో ధనుష్ ఇటీవల ‘మారన్’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించాడు.  బాలీవుడ్‌లో కూడా ధనుష్‌కి మంచి ఇమేజ్ ఉంది. అలాగే హాలీవుడ్ లోనూ ధనుష్ నటించి మెప్పించాడు. అయితే అతడు తెలుగులో మాత్రం ఇంతవరకూ మంచి మార్కెట్ ను సంపాదించుకోలేకపోయాడు. గతంలో పలు డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ అంతగా రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ‘వాత్తి’ పేరుతో తమిళం కూడా చిత్రం విడుదల కానుంది. సగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ ను వాయిదా వేసుకుంది. ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. ధనుష్ హీరోగా త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇక ధనుష్ తెలుగులో మరో సినిమాలో కూడా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.  


దిల్‌రాజు బ్యానర్ లో త్వరలోనే ధనుష్ తో సినిమా ఉంటుందని టాక్స్ వినిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ధనుష్ కోసం ఓ మాస్ కథను వండిస్తున్నారట దిల్ రాజు. త్వరలోనే సినిమా ప్రకటన రాబోతోంది. ఆ వెంటనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళతారట. ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు ఒకటొకటే పూర్తవుతున్నాయి. ఆ తర్వాత ధనుష్  దిల్ రాజు సినిమా కోసం డేట్స్ ఇస్తారట. అయితే ఇది కూడా మల్టీ లాంగ్వేజెస్ లో విడుదలవుతుందట. మరి సార్ తర్వాత ధనుష్ దిల్ రాజు చిత్రంలో నటిస్తాడా లేక శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తాడా అని ఓ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-13T16:57:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!