Chiranjeevi : సంచలన నిర్ణయం ?

ABN , First Publish Date - 2022-07-08T17:40:07+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మునుపెన్నడూ ఎరుగని రీతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ‘ఆచార్య’ (Acharya) చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని చవిచూశారు.

Chiranjeevi : సంచలన నిర్ణయం ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మునుపెన్నడూ ఎరుగని రీతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ‘ఆచార్య’ (Acharya) చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని చవిచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనూహ్యంగా పరాజయం పాలై.. ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమా పరాజయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో తదుపరి చిత్రాల్ని విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ (Godfather) చిత్రాన్ని ఈ దసరాకి, 154వ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అలాగే. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’ (Bhola Shankar) చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకా కొందరు యువ దర్శకులతో మెగాస్టార్ తదుపరి చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తాజా సమాచారం. తన స్థాయి స్టార్ డమ్ ఉన్న సమకాలీన హీరోలకు దీటుగా చిరు కొత్త అడుగు వేయడానికి రెడీ అవుతున్నారట. అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీలో నటించడంపై ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ సాంప్రదాయం ఇప్పటికే మొదలైంది. తెలుగులో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇటీవల జగపతి బాబు (Jagapathi Babu), శ్రీకాంత్ (Srikanth), సాయికుమార్ (Saikumar) లాంటి కేరక్టర్ నటులతో పాటు సత్యదేవ్ (Satyadev) లాంటి యంగ్ హీరోలు సైతం..  వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఎంటర్ అవుతున్న తొలి సూపర్ స్టార్‌గా చిరంజీవి సరికొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నారట. ఈ క్రమంలో చిరు మంచి వెబ్ సిరీస్ కోసం చూస్తున్నారట. ఆల్రెడీ సినియర్ హీరో వెంకటేశ్ (Venkatesh).. రానా (Rana) తో కలిసి ‘రానానాయుడు’ (Rananaidu) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


నిజానికి చిరంజీవి స్థాయి స్టార్స్ అయిన రజనీకాంత్ (Rajanikanth), మోహన్ లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty), సల్మాన్ ఖాన్ (Salmankhan) లాంటి సూపర్ స్టార్స్ ఇంకా ఓటీటీవైపు చూడలేదు. అయితే వీరందరి కంటే ముందే ఓటీటీలోకి ప్రవేశించి.. సరికొత్త రికార్డు సొంతం చేసుకోవాలని చిరంజీవి ప్లాన్‌గా తెలుస్తోంది. ఇండియా వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్న రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు ఇప్పటికే చిరును సంప్రదించారని, ఓ భారీ వెబ్ సిరీస్ కోసం చిరును ఒప్పించారని సమాచారం. అయితే వెబ్ సిరీస్ లో నటించడమంటే.. సినిమాల్లో నటించినంత తేలికకాదు. ఆయన్ని పక్కగా ఎస్టాబ్లిష్ చేయగలిగే అదిరిపోయే స్ర్కిప్ట్స్ కావాలి. అలాంటి కథలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని చిరు చెప్పారని కూడా తెలుస్తోంది. మరి మెగాస్టార్ మొట్టమొదటి ఓటీటీ జెర్నీ.. ఎప్పుడు షురూ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-08T17:40:07+05:30 IST