Chiranjeevi : పేరులో స్పెల్లింగ్ మార్పు.. అందుకేనా?
ABN, First Publish Date - 2022-07-05T20:45:28+05:30
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చింది. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం, మరో హీరోగా రామ్ చరణ్ (Ramcharan) నటించడం.. కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) ఎంపిక.. ఇవన్నీ సినిమాకి అదనపు బలంగా మారతాయని అనుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చింది. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం, మరో హీరోగా రామ్ చరణ్ (Ramcharan) నటించడం.. కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) ఎంపిక.. ఇవన్నీ సినిమాకి అదనపు బలంగా మారతాయని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే విడుదలకు ముందు సినిమాకి మంచి హైపు క్రియేట్ అయింది. సినిమా కోసం ప్రత్యేకించి భారీ టెంపుల్ సెట్ కూడా క్రియేట్ చేశారు. ‘సైరా’ (Saira) తర్వాత చిరు నటించిన సినిమా ఇదే కావడం, ఇప్పటివరకూ ఫ్లాప్ అన్నదే లేకుండా దర్శకుడిగా దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వం వహించడం.. ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అయితే సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టరైంది. బయ్యర్స్ కు దాదాపు రూ. 70 కోట్ల నష్టం వచ్చింది.
‘ఆచార్య’ చిత్రం రిజల్ట్ చిరంజీవి మిగిలిన చిత్రాలపై కొద్దో గొప్పో ప్రభావం చూపించింది. ఈ క్రమంలో చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ (Godfather), భోళాశంకర్ (Bhola Shankar), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)’ చిత్రాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంలేదని భావిస్తున్నారు. ఈ కారణంగానే చిరంజీవి తన పేరు స్పెల్లింగ్ లో స్వల్ప మార్పు చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల చిరు ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ టీజర్ విడుదలైన సందర్భంగా .. Chiranjeevi అనే పేరు Chiranjeeevi గా కనిపించింది. ఆయన తన పేరులో మరో E ని అదనంగా చేర్చడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చాంశనీయంగా మారింది.
న్యూమరాలజీ ప్రకారమే చిరంజీవి తన పేరులోని స్పెల్లింగ్ ను అలా మార్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా మంది నటీనటులు, హీరో,హీరోయిన్స్ తమ పేర్లలో స్పెల్లింగ్‌లను మార్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా వారి బాటలోనే నడుస్తున్నారని అనుకోవాలి. చిరంజీవి తన కెరీర్ లో ఇదివరకెన్నడూ ‘ఆచార్య’ లాంటి భారీ డిజాస్టార్‌ను ఎదుర్కోలేదు. అందుకే ఇలా Chiranjeevi ‘గాడ్‌ఫాదర్’ చిత్రం కోసం Chiranjeeevi గా మారారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ న్యూమరాలజీ ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని ఎంత పెద్ద హిట్ చేస్తుందో వేచి చూడాలి.