హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

ABN , First Publish Date - 2022-03-23T14:04:04+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ వచ్చేనెల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిరు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’, మెహర్ రమేశ్ ‘భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సందేశాత్మక చిత్రంలో కూడా నటించబోతున్నారు. ఇవి కాకుండా చిరంజీవి మరో దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. అతడు మరెవరో కాదు. మాస్ దర్శకుడు హరీశ్ శంకర్. ‘గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, గద్దల కొండ గణేశ్’ లాంటి చిత్రాల్ని మెగా హీరోలతో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న హరీశ్.. త్వరలో పవర్ స్టార్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ వచ్చేనెల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిరు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’, మెహర్ రమేశ్ ‘భోళాశంకర్’,  బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సందేశాత్మక చిత్రంలో కూడా నటించబోతున్నారు. ఇవి కాకుండా చిరంజీవి మరో దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. అతడు మరెవరో కాదు. మాస్ దర్శకుడు హరీశ్ శంకర్. ‘గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, గద్దల కొండ గణేశ్’ లాంటి చిత్రాల్ని మెగా హీరోలతో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న హరీశ్..  త్వరలో పవర్ స్టార్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు.   అలాంటి ఈ దర్శకుడు మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కినట్టు వార్తలొస్తున్నాయి. రీమేక్స్ తీయడంలో చెయితిరిగిన హరీశ్‌శంకర్ చిరంజీవితో తీయబోయే సినిమా కూడా రీమేకే అవడం విశేషం.


ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బ్రోడాడీ’ చిత్రాన్ని  హరీశ్ తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నట్టు టాక్. మోహన్ లాల్, పృధ్విరాజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాని పృధ్విరాజే స్వయంగా డైరెక్ట్ చేశారు. తండ్రీ, కొడుకుల అనుబంధాన్ని బేస్ చేసుకొని హిలేరియస్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ హీరో ఎవరు అనే విషయంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. నిజానికి ఈ సినిమా విక్టరీ వెంకటేశ్, రానా హీరోలుగా రానున్నట్టు వార్తలొచ్చాయి. అలాగే.. నాగార్జున, అఖిల్ హీరోలుగా తెరకెక్కనున్నట్టు కూడా టాక్స్ వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు ఈ మూవీ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2022-03-23T14:04:04+05:30 IST