Bheemla Nayak : బ్రహ్మీ పాత్ర అంత నవ్విస్తుందా?
ABN , First Publish Date - 2022-02-21T15:29:37+05:30 IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’..ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సంక్రాంతికి విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ నమోదు చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్‌గా థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగానూ, ఆత్రుతగానూ ఉన్నారు. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సోల్ మిస్ అవకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా.. తనదైన శైలిలో స్ర్కిప్ట్ ను తీర్చిదిద్దాడట త్రివిక్రమ్. అయితే ఒరిజినల్ వెర్షన్ లో కామెడీ అసలేమాత్రం ఉండదు. సినిమా అంతా సీరియస్ మోడ్ లోనే సాగుతుంది. తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి.. ఆయన రేంజ్‌కు తగ్గట్టుగా త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆ పాత్రకి చమత్కారాన్ని కూడా మిక్స్ చేయచేశారట. అదే విధంగా ఒరిజినల్‌లో లేని ఓ కామెడీ పాత్రను కూడా క్రియేట్ చేశారట త్రివిక్రమ్. ఆ పాత్రను బ్రహ్మానందం చేసినట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ చిత్రాల్లో బ్రహ్మానందానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. ఆయన రైటర్ గా ఉన్నప్పుడు ‘నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు, జైచిరంజీవ’ లాంటి చిత్రాల్లో బ్రహ్మానందానికి అద్భుతమైన పాత్రలు రాశారు త్రివిక్రమ్. అలాగే.. దర్శకుడయ్యాకా ‘అతడు, ఖలేజా, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఆయనకి చెప్పుకోదగ్గ పాత్రల్ని క్రియేట్ చేసి ఆయనచేత నవ్వులు పూయించారు త్రివిక్రమ్. బ్రహ్మీ.. సినిమాల్లో కనిపించడం తగ్గిపోయినప్పటికీ.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో రాములో పాటలో బ్రహ్మానందాన్ని మెరుపులా ప్రవేశపెట్టి.. ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో ‘భీమ్లానాయక్’ చిత్రంలో బ్రహ్మీ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ ఫాలో అయ్యారని తెలుస్తోంది. ఇందులో బ్రహ్మానందం పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. ఆయన పాత్ర హిలేరియస్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో వింటేజ్ బ్రహ్మానందం కామెడీ కనిపిస్తుందని అంటున్నారు.
సినిమా చివరిలో బ్రహ్మానందం పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఈ పాత్ర బ్రహ్మీ కెరీర్ కు మంచి బూస్టప్ నిస్తుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత బ్రహ్మీ మళ్ళీ కమెడియన్ గా బిజీ అవుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో బ్రహ్మీ కామెడీని మిస్ అయ్యారు ప్రేక్షకులకు ఆలోటును ‘భీమ్లానాయక్’ చిత్రంలోని ఆయన పోలీస్ పాత్ర తీర్చేస్తుందని అంటున్నారు. మరి బ్రహ్మీ పాత్ర ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి.